Sunday, January 19, 2025
Homeసినిమాఎన్నికల తేదీ కోసం ఆ సినిమాలు ఎదురు చూస్తున్నాయా..?

ఎన్నికల తేదీ కోసం ఆ సినిమాలు ఎదురు చూస్తున్నాయా..?

ఎన్నికల తేదీ కోసం సినిమాలు ఎదురు చూడడం ఏంటి అనుకుంటున్నారా..? డిసెంబర్ నెలాఖరులో వెంకటేష్ ‘సైంధవ్‘, నాని ‘హాయ్ నాన్న’, నితిన్ ‘ఎక్స్ ట్రా’ సినిమాలు రిలీజ్ కి ప్లాన్ చేశారు. అయితే.. డిసెంబర్ 22న ప్రభాస్ సలార్ మూవీ వస్తుండడంతో వెంకీ, నాని, నితిన్ సినిమాల రిలీజ్ డేట్స్ మార్చుకోవాల్సి వచ్చింది. ఈ చిత్రాలు షూటింగ్ దాదాపు పూర్తయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుంటున్నాయి. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేద్దామనుకుంటే.. ఎన్నికల హాడావిడి ఉంటుంది. ఆ టైమ్ లో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని అనుకుంటున్నారు మేకర్స్.

దీంతో ఎన్నికల తేదీ కోసం ఈ సినిమాలు వెయిట్ చేస్తున్నాయి. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని సమాచారం. ఎలక్షన్ డేట్ ను బట్టి ఈ సినిమాలను ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందో నిర్ణయం తీసుకుంటారట. జనవరిలో రిలీజ్ చేద్దామంటే.. ఆల్రెడీ అక్కడ స్పేస్ లేదు. సంక్రాంతికి వస్తున్నాం అంటూ ఎప్పటి నుంచో కొన్ని సినిమాలు అనౌన్స్ చేసి బెర్త్ కన్ ఫర్మ్ చేసుకున్నాయి. అందుచేత ఈ సినిమాలను ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియక మేకర్స్ తెగ టెన్షన్ పడుతున్నారట. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఎలక్షన్స్ ఉంటే.. ఫిబ్రవరిలో రిలీజ్ చేయడం బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట.

ప్రజెంట్ సినిమాను బాగా తీయడం మాత్రమే కాదు.. రిలీజ్ కి మంచి డేట్ కుదరడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే రిలీజ్ విషయంలో మేకర్స్ చాలా కేర్ తీసుకుంటుంటారు. ఎంత కేర్ తీసుకున్నప్పటికీ..  అప్పుడప్పుడు ఇలా ఊహించని పరిణామాలతో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. మరి.. వెంకీ, నాని, నితిన్ సినిమాలు ఎప్పుడు థియేటర్లోకి వస్తాయో క్లారిటీ రావాలంటే.. ఎన్నికల తేదీ ప్రకటన రావాల్సిందే.

Also Read: సాంగ్ ప్రొమోతో ఆకట్టుకుంటున్న ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్