ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ కేసులు వేగంగా కాకపోయినా నెమ్మదిగా పెరుగుతున్నాయి. గడచిన ఆరు నెలల గణాంకాల ప్రకారం చూస్తే దక్షిణ కొరియాలో డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడి కరోనా కేసుల్లో దాదాపు పాతిక శాతం డెల్టా వేరియంట్ కేసులే. తరువాత ప్రమాదకర స్థాయిలో డెల్టా కేసులు పెరుగుతున్న దేశం ఆస్ట్రేలియా. సాధారణ కోవిడ్ తో పోలిస్తే డెల్టా వేరియంట్ మరింత వేగంగా వ్యాపిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు.
జపాన్, ఇండోనేషియా, జర్మనీ, పోర్చుగల్, అమెరికాలను డెల్టా వేరియంట్ ఎక్కువగా భయపెడుతోంది. కరోనా రెండో దశ తరువాత క్రమంగా కేసులు తగ్గు ముఖం పడుతున్న దశలో డెల్టా వేరియంట్ కేసులు బయటపడుతుండడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలను మళ్లీ మూసేయాల్సి వస్తుందని ఆయా దేశాలు అనుకుంటున్నాయి.