Friday, November 22, 2024
HomeTrending Newsత్రిశంకు స్వర్గంలో విఆర్వోలు

త్రిశంకు స్వర్గంలో విఆర్వోలు

రాష్ట్రంలో వీఆర్వో పోస్ట్ రద్దు అయినప్పటి నుంచి ఇప్పటివరకు 9 రోజులు మినహా ఒక సంవత్సరం  కావస్గతోంది.  ఇప్పటివరకు వారికి జాబ్ చార్ట్ ఇవ్వలేదు.  దీంతో వారు తీవ్ర నిరాశలో ఉన్నారు.

తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం మాటల్లోనే…

నియమ నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న విఆర్వో లకి ఒక హోదా కల్పించకుండా జాబ్ చాట్ ఇవ్వకుండా వీఆర్వోల యొక్క సమస్యలను వినడానికి సి ఎస్ గారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా మా యొక్క హక్కులకు బంగం కలిగేటట్టు వ్యవహరిస్తున్నారు
ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా తదుపరి ప్రమోషన్ల కొరకు సర్వే ట్రైనింగ్ కు పంపకుండా కారుణ్య నియామకం చేపట్టకుండా జోనల్ వ్యవస్థ లో ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి ఆప్షన్ లేకుండా ప్రమోషన్లు ఇవ్వకుండా మాకు రావలసిన హక్కులను కాలరాస్తున్నారు.

ఈ రాష్ట్రంలో 5485 గ్రామ రెవెన్యూ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు
ఇందులో దాదాపు 95″% శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ ఓసి వెనుకబడిన వర్గాల ఉద్యోగులు పనిచేస్తూ,  ప్రభుత్వం ద్వారా వచ్చిన సంక్షేమ పథకాలన్నీ తూచా తప్పకుండా అమలు జరిగే దిశగా పని చేస్తున్నాం

జీవో నెంబర్ 259 తేదీ 30. 8 .2021 ద్వారా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసును మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలకు కుదించడం జరిగింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగి అర్హతను బట్టి పదోన్నతులు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వుల ద్వారా అర్హులైన గ్రామ రెవెన్యూ అధికారులు అందరికీ పదోన్నతులు కల్పించే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం

సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్లో భారీ ఆత్మగౌరవ సభ నిర్వహించి, ఆత్మగౌరవ సభ ద్వారా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం  ప్రకటించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్