Saturday, January 18, 2025
Homeసినిమా డీజే టిల్లు సీక్వెల్ కి 'టిల్లు స్క్వేర్' అనే టైటిల్ ని ఖరారు

 డీజే టిల్లు సీక్వెల్ కి ‘టిల్లు స్క్వేర్’ అనే టైటిల్ ని ఖరారు

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ‘డీజే టిల్లు‘ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ విడుదల సమయంలోనే నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సిద్ధుతో ‘డీజే టిల్లు’ సీక్వెల్ చేస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే ‘డీజే టిల్లు’ సీక్వెల్ ని రూపొందిస్తూ మాట నిలబెట్టుకున్నారు నాగవంశీ. ‘డీజే టిల్లు’ సీక్వెల్ కి ‘టిల్లు స్క్వేర్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.

సీక్వెల్ లో సిద్ధుకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

‘టిల్లు స్క్వేర్’ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. బాక్సాఫీస్ దగ్గర ‘డీజే టిల్లు’ సంచలనం సృష్టించిన ఏడాదికే 2023 మార్చిలో సీక్వెల్ థియేటర్లలో సందడి చేయనుంది. ‘టిల్లు స్క్వేర్’ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక ప్రత్యేక వీడిమోని విడుదల చేసింది చిత్ర బృందం. అందులో టిల్లు మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీస్ తో వాదన పెట్టుకోవడం నవ్వులు పూయించింది. తాను హీరోనని, తన పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే ని తీసుకుందాం అనుకుంటే డేట్స్ ఖాళీగా లేవని చెప్పడం అలరించింది. రెండు నిమిషాల నిడివి గల వీడియోతో సీక్వెల్ లో ‘డీజే టిల్లు’ని మించిన వినోదాన్ని పంచబోతున్నారని చెప్పకనే చెప్పేశారు మేకర్స్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్