తెలంగాణ గవర్నర్ లక్ష్మణరేఖను దాటుతున్నారని సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ విమర్శించారు. మహిళల దర్బార్ దేనికి పెడుతున్నారని, సహజంగా యెవరయినా ప్రతినిది వర్గం వస్తే కలవచ్చు, వారిచ్హే వినతిపత్రాన్ని స్వీకరించి ప్రభుత్వానికి పంపవచ్చన్నారు. గవర్నర్ తమిలి సై రాజ్ భవన్ గౌరవం కాపాడాలని నారాయణ సూచించారు. అంతేగాని రాజకీయ కార్యకలాపాలకు రాజ్ బవన్ ను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ కు రాజకీయ నేపద్యం వున్న సంగతి తెలుసని, అయితే వేషం మార్చుకుని తటస్త బాద్యతతో వచ్చారు కనుక… ఆమేరకే వారి ప్రవర్తన, విధానాలు వుండాలని నారాయణ స్పష్టం చేశారు. అయితే గవర్నర్ పాత్ర రాజకీయ పరంగావుంది . యిది ఫెడరల్ రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకం . తలపెట్టిన దర్బార్ ను రద్దుచేయాలని నారాయణ డిమాండ్ చేశారు.
ఒకవైపు BJP రాజకీయ దాడి పెంచింది, మరోవైపు గవర్నర్ పాత్ర అగ్గికీ అజ్యం పోస్తున్నదని నారాయాణ మండిపడ్డారు. తెరాస ప్రభుత్వంపై విదానపరంగా cpi పోరాడుతున్నదని, మైనర్లను పబ్ లోకి అనుమతించడం చట్టరిత్యా నేరం అన్నారు. అపబ్ ను సీజ్ చేసి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేయకపోగా ఆ సంఘటననే తప్పుదారి పట్టించే విధంగా తెరాస ప్రభుత్వం మసి పూసి మారేడుకాయ చేస్తున్నదని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.