I Connect: పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన సినిమా ‘ది వారియర్‘. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకం పై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్. విజిల్ మహాలక్ష్మి రోల్ చేశారు. ఈ సినిమా విడుదల సందర్భంగా కృతి శెట్టి చెప్పిన చిత్ర విశేషాలు ఆమె మాటల్లోనే…
లింగుస్వామి గారు తీసిన ‘ఆవారా’ను చాలా ఏళ్ళ క్రితం తమిళంలో చూశా. ఆ సినిమా నాకొక జ్ఞాపకం. అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సినిమా సీడీ తీసుకువెళ్లే దాన్ని. ఒక్కో రోజు రెండు మూడు సార్లు చూసిన సందర్భాలు ఉన్నాయి. లింగుస్వామి ఫోన్ చేశారని అమ్మ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే… ఆయన సినిమాలు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. కథలు కొత్తగా ఉంటాయి. హీరోయిన్లకు పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న రోల్స్ ఉంటాయి. కథ విన్న తర్వాత ఇంకా ఎగ్జైట్ అయ్యాను.
షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు కొంచెం నెర్వస్ ఫీలయ్యాను. రామ్ గారి ఎనర్జీ మ్యాచ్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి. కానీ, ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. నేను కూడా ఎంజాయ్ చేస్తూ చేశా. ‘బుల్లెట్…’ సాంగ్ క్లాస్ అయితే ‘విజిల్…’ సాంగ్ మాస్. నాకు ఎక్స్ట్రా ఎనర్జీ కావాలని అనుకున్నప్పుడు విజిల్ సాంగ్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తాను. కొంచెం స్టయిలిష్ అంటే ‘బుల్లెట్…’ సాంగ్. పాటలకు ముందు వచ్చే సీన్స్ చాలా బావుంటాయి.
‘ది వారియర్’లో నా పాత్ర అందరూ ప్రేమించేలా ఉంటుంది. గాళ్ నెక్స్ట్ డోర్, క్యూట్ రోల్. కథ విన్న వెంటనే నేను కనెక్ట్ అయ్యాను. ప్రేక్షకులు కూడా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నా. సినిమా చూసినప్పుడు మన ఇంట్లో అమ్మాయి లేదా పక్కింటి అమ్మాయి అనుకుంటారు. నా క్యారెక్టర్ పేరు విజిల్ మహాలక్ష్మి. ఆ అమ్మాయి ఆర్జే. ద ర్శకుడు లింగుస్వామి గారికి
ఏం కావాలో స్పష్టంగా తెలుసు. కొన్నిసార్లు ఎలా నటించాలో చేసి మరీ చూపిస్తారు. వాయిస్ మాడ్యులేషన్ కూడా చేశారు. అందుచేత ఈ క్యారెక్టర్ చేయడంలో ఆయన చెప్పినట్టు ఫాలో అయిపోయాను… అంటూ పలు విశేషాలు తెలియజేసింది.
Also Read : ‘ది వారియర్’తో కోలీవుడ్ తెరకి కోలకళ్ల పిల్ల!