Friday, November 22, 2024
Homeఅంతర్జాతీయం96 దేశాల్లో డెల్టా వేరియంట్

96 దేశాల్లో డెల్టా వేరియంట్

డెల్టా రకం కరోనా వైరస్‌ ప్రస్తుతం 96 దేశాల్లో కనిపిస్తోందని, మరి కొద్ది నెలల్లో మరింత ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. డెల్టా వేరియంట్‌కు సంక్రమణ వేగం అధికమనే విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ 96 దేశాలు డెల్టా వేరియంట్‌ తమ భూభాగాల్లో ఉన్నట్లు గుర్తించాయని, అత్యధిక బాధితులు దీనివల్లే ఆసుపత్రుల్లో చేరుతున్నారని తెలిపాయని డబ్ల్యూహెచ్‌వో తన తాజా వారాంతపు (జూన్‌ 21-27) నివేదికలో పేర్కొంది.

డెల్టా వేరియంట్‌ జన్యుక్రమాన్ని విశ్లేషించే సదుపాయాలు చాలా దేశాల్లో లేనందున దాని ఉనికిని నిర్ధరించలేకపోతున్నాయని, వాస్తవానికి వందకు పైగా దేశాలకు అది విస్తరించి ఉండవచ్చని అభిప్రాయపడింది. అనేక దేశాల్లో వ్యాక్సినేషన్‌ చాలా స్వల్పంగా జరుగుతున్నందున వైరస్‌ నిరోధక జాగ్రత్తల్ని విస్తృతంగానే కొనసాగించాలని తెలిపింది. బ్రెజిల్‌, కొలంబియా, రష్యా, అర్జెంటీనా, మయన్మార్‌, ఇండోనేసియా, బంగ్లాదేశ్‌లలో కొత్త కేసుల ఉద్ధృతి కొనసాగుతున్నట్టు గణాంకాలతో పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్