Saturday, January 18, 2025
Homeసినిమా'గాడ్ ఫాదర్'  లో పది సర్ ప్రైజ్ లు : మోహన్ రాజా

‘గాడ్ ఫాదర్’  లో పది సర్ ప్రైజ్ లు : మోహన్ రాజా

భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటించిన‌ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ ‘గాడ్ ఫాదర్‘ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌ల పై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌ గా నిర్మించారు. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవుతుంది.

ఈ సంద‌ర్భంగా దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ “నిర్మాత ఎన్వీ ప్రసాద్ గారు నాకు చిన్నప్పటి నుండి తెలుసు. నేనంటే చాలా ఇష్టం ఆయనికి. నన్ను మళ్ళీ తెలుగులోకి రమ్మని పిలిచేవారు. ఒకసారి మహేశ్ బాబు దగ్గరికి కూడా తీసుకెళ్ళారు. తని వరువన్ నుండి నాకు చరణ్ కి పరిచయం ఏర్పడింది. ధ్రువ -2 గురించి చర్చలు జరుపుతున్న సమయంలో లూసిఫర్ ప్రస్తావన వచ్చింది. ఈ సినిమాకి దర్శకుడిగా ఎన్వీ ప్రసాద్ గారే నా పేరుని సూచించారు. చరణ్ బాబు, చిరంజీవి గారికి నచ్చింది. ఫోన్ చేసి పిలిపించారు. వారిని కలిసే ముందే లూసిఫర్ ని చూశాను. అందులో నాకు ఒక కొత్త కోణం దొరికింది. అదే చిరంజీవి గారితో పంచుకున్నాను. ఆ కోణం చిరంజీవి గారికి చాలా నచ్చింది.”

God Father U A Certificate

“లూసిఫర్ లో లేని ఒక కోణం గాడ్ ఫాదర్ లో వుంటుంది. కథని అలానే వుంచి ఫ్రెష్ స్క్రీన్ ప్లే చేశాను. గాడ్ ఫాదర్ స్క్రీన్ ప్లే చాలా సర్ ప్రైజింగ్ గా వుంటుంది. ఇందులో హీరోతో పాటు మరో పది పాత్రలు కూడా గెలుస్తాయి. మలయాళంలో చూడని పది పాత్రలు ఇందులో వేరే రూపంలో వుంటాయి. ఈ పాత్రలు చాలా సర్ ప్రైజింగ్ గా వుంటాయి. చిరంజీవి, సల్మాన్ ఖాన్ లాంటి ఇద్దరు మెగాస్టార్లని డైరెక్ట్ చేయడం అంత సులువైన విషయం కాదు.చాలా ఒత్తిడి వుంటుంది. అయితే… మెగాస్టార్ చిరంజీవి గారు ఆ ఒత్తిడిని తీసేశారు. చిరంజీవి గారు ఇచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేను. సల్మాన్ ఖాన్ గారు కూడా చాలా కూల్ వుంటారు. చిరంజీవి గారిపై వున్న ప్రేమతో ఈ సినిమాని చేశారు సల్మాన్. మలయాళంలో లుసిఫర్ 2 మొదలైయింది. ప్రస్తుతం నా ద్రుష్టి మాత్రం గాడ్ ఫాదర్ పైనే వుంది. అయితే గాడ్ ఫాదర్ సీక్వెల్ కి మంచి కంటెంట్ వుంది. తని వరువన్ సీక్వెల్ ఆలోచన కూడా వుంది” అన్నారు.

Also Read అందుకే ‘గాడ్ ఫాదర్’ లో నటించా: సల్మాన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్