Saturday, November 23, 2024
HomeసినిమాJr Ntr, Trivikram: ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య గొడవలు లేనట్టేనా..?

Jr Ntr, Trivikram: ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య గొడవలు లేనట్టేనా..?

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ‘అరవింద సమేత’ అనే సినిమా చేయడం.. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించడం తెలిసిందే. ఆతర్వాత వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు.. అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ… ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య విభేదాలు వచ్చాయని.. అందుకనే ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల ఎన్టీఆర్ 30వ సినిమా ప్రారంభోత్సవానికి కూడా త్రివిక్రమ్ రాకపోవడంతో ఆ గొడవలు అలాగే ఉన్నాయని టాక్ వినిపించింది.

ఇప్పుడు ఎన్టీఆర్ ఇంట్లో పార్టీ జరిగింది. అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫరెల్ ఇండియాకి వచ్చిన సందర్భంగా ఎన్టీఆర్ తన ఇంట్లో విందు ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి రాజమౌళి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్, శిరీష్, రవి సహా ఇతర సెలబ్రిటీలు హాజరు అయ్యారు. దిల్ రాజు సిటీలో లేకపోవడం రాలేదని తెలిసింది. అయితే… ఈ విందుకు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. దీంతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య గొడవలు అనే వార్తలకు తెరపడినట్లు అయ్యింది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు.

ఎన్టీఆర్.. కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా ఇటీవల షూటింగ్ ప్రారంభం అయ్యింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఆతర్వాత ఎన్టీఆర్ ‘వార్ 2’ చేయనున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ తో కూడా మూవీ ఉంది. ఇక త్రివిక్రమ్.. మహేష్‌ తో సినిమా చేస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ మూవీ తర్వాత బన్నీతో త్రివిక్రమ్ మూవీ ఉంది. మరి… వీరి కమిట్ మెంట్స్ పూర్తైన తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తారేమో.

Also Read: ఎన్టీఆర్ తో మూవీపై క్లారిటీ ఇచ్చిన వెట్రిమారన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్