ఒక జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీగా గుర్తింపు ఇవ్వడంలో అనేక ఇబ్బందులు, సందేహాలు ఉంటాయని టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీపై ఆయన స్పందించారు. ఎంత ఓటింగ్ శాతం వచ్చింది, ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది, ఎన్నిటిలో కనీస స్థాయి బలం ఉండనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు. సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ విభజనకు కారణమైన కేసిఆర్ పార్టీకి ఇక్కడ ఉనికి ఉంటుందని తాను అనుకోవడంలేదన్నారు.
టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ అయ్యిందని, టి ప్లేస్ లో బి వచ్చిందని, అప్పుడే కేసిఆర్ ప్రధాని అయినట్లు ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని గోరంట్ల ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఉన్న జాతీయ పార్టీలకే ఏపీలో స్థానం లేదని, ఆ రెన్దోఒ ఇక్కడ కాలగర్భంలో కలిసి పోయాయని అలాంటిది మరో పార్టీకి ఇక్కడ ఏదో ఒరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు.