Friday, September 20, 2024
HomeTrending Newsమాది కాన్ఫిడెన్స్... ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు: సజ్జల

మాది కాన్ఫిడెన్స్… ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు: సజ్జల

విజయంపై తాము సంపూర్ణ విశ్వాసంతో ఉన్నామని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఓటింగ్ శాతం చూసిన తర్వాత అది యాంటీ ఇన్ కంబెన్సీ అనుకోవడానికి వీలులేదని,  జగన్ పై వ్యతిరేకత ఉండడానికి సరైన కారణాలు లేవని అభిప్రాయపడ్డారు. టిడిపి గెలవడానికి ఒక్క కారణం చెప్పాలని…. బాబు ప్రకటించిన సూపర్ సిక్స్ గానీ, ఆయన్ను హఠాత్తుగా సిఎం చేయాలన్న బలమైన కోరిక కూడా ప్రజల్లో లేదని… అందుకే సూపర్ సిక్స్ పై ప్రచారం కూడా  బాబు చేయలేదన్నారు. చెప్పుకోవడానికి ఏమీ లేకనే  జగన్ పై వ్యక్తిత్వ హననానికి దిగారని, వివేకా మర్డర్ కేస్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్  లాంటి అంశాలను తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు.  బాబు ఇప్పుడెందుకు ఆ యాక్ట్ పై మాట్లాడడం లేదని ప్రశ్నించారు.  గత ఎన్నికల్లో గెలిచిన సీట్లకంటే ఎక్కువ గెలుస్తామని…  తమది కాన్ఫిడెన్స్ అని, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదని సజ్జల స్పష్టం చేశారు. పోలింగ్ శాతం పెరిగితే గెలుస్తామన్న భ్రమల్లో టిడిపి ఉందని, కానీ ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ తాము గెలుస్తామని తేల్చి చెపారు. తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల సంఘం వైఫల్యం వల్లే ఏపీలో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని, కుట్ర పూరితంగా కేంద్ర ప్రభుత్వ సాయంతో కొందరు అధికారులను మార్చారని సజ్జల ఆరోపించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ఈసీ నియమించిన పోలీస్ పరిశీలకుడిని వెంటనే మార్చాలని, తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తున్న అధికారులను పక్కన పెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సిసి కెమెరాలను పోలీసులే ధ్వంసం చేయడం సరికాదన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్