Wednesday, February 26, 2025
HomeTrending NewsAmbati Comment: అది పాత కలయికకు కొత్త రూపం

Ambati Comment: అది పాత కలయికకు కొత్త రూపం

రాజమండ్రిలో పుత్రుడు, దత్తపుత్రుడు ఇద్దరూ కలిసి  ఏర్పాటు చేసుకున్న సమావేశం కూడా అట్టర్‌ ప్లాప్‌ షో అని అంబటి అభివర్ణించారు.  సున్నా సున్నా కలిస్తే సున్నా అవుతుందని, సున్నా సున్నా హెచ్చిస్తే సున్నానే అవుతుందని  తమ నాయకుడు మొన్ననే చెప్పారని, నేడు అదే ఇక్కడ కనిపించిందని ఎద్దేవా చేశారు.  ఇది కొత్త కలయికేం కాదని, పాతదేనని… పాతకలయికకు రాజమండ్రిలో కొత్త రూపాన్ని ఇచ్చారని అంబటి అన్నారు. వైఎస్సార్సీపీకి వ్యతిరేకం కాదని, వారి విధానాలకే వ్యతిరేకమని పవన్‌ అంటున్నారని, తాము కూడా  ఆయనకు వ్యతిరేకం కాదని,  ఆయనకూ మాకు ఏమన్నా తగాదా ఉందా? అని ప్రశ్నించారు.

“2014లో నువ్వు తెలుగుదేశంతోనే కదా ముందుకు వెళ్లావ్‌..?  2019లో టీడీపీతో కాకుండా విడిగా పోటీ చేశావ్‌..ఇప్పుడు మళ్లీ కలిసి పోటీ చేస్తున్నావు. అందుకే కదా నిన్ను ప్యాకేజీ స్టార్‌ అన్నది..నువ్వు ప్యాకేజీ స్టార్‌ వి కాబట్టే నీ విధానాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. నీ మీద మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు.
నీ విధానమే తప్పు…టీడీపీ కోసమే పుట్టినటువంటి రాజకీయ పార్టీ నీది.  టీడీపీకి ఏదైనా నష్టం జరుగుతుందనుకుంటే వెంటనే కాసుకోడానికి వస్తావు” అంటూ పవన్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు మనోధైర్యం ఇవ్వడం కోసం ఈ సమావేశం రాజమండ్రిలో పెట్టామని పవన్‌ అంటున్నారాణి,  అంటే చంద్రబాబుకు మనోధైర్యం మనోధైర్యం ఇవ్వడం కోసమే తప్ప ప్రజల కోసం ఏమీ చర్చించలేదనేది సుస్పష్టమైందని రాంబాబు అన్నారు.

అమిత్ షా తో లోకేష్ భేటీపై కూడా మంత్రి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు.  “కిషన్‌ రెడ్డి చాలా వాస్తవాలు చెప్పారు. వన్‌ కల్యాణ్‌ వెళ్లి అమిత్‌షాని కలిసి ఇది అక్రమ అరెస్ట్‌ అని చెప్తాను అన్నాడు..కానీ కలవలేదు.  నారా లోకేశ్‌ మాత్రం వెళ్లి అమిత్‌షాను కలిశాడు..అమిత్‌షా నన్ను రమ్మంటేనే వెళ్లానని అన్నాడు.  అమిత్‌షాను కలపమని ఢిల్లీలో ఉండి ప్రాధేయపడితే అపాయింట్‌మెంట్‌ ఇప్పించానని కిషన్‌ రెడ్డి  చెప్పాడు. అంతవరకే నా ఉద్దేశం..శతృవులను సైతం అమిత్‌షా కలుస్తారని కూడా చెప్పాడు” అన్నారు.

బాబు ఆరోగ్యం గురించి వాకబు చేశారని, కేసు  ఏ బెంచ్‌కి వచ్చింది…ఏ జడ్జి దగ్గర ఉంది అని కూడా అడిగారంటూ లోకేష్ చెప్పారు. ఇలాంటి తప్పుడు మాటలతో మీ డొల్లతనం బయపటడుతోంది అంటూ రాంబాబు దుయ్యబట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్