Saturday, June 29, 2024
Homeసినిమా'వినరో భాగ్యము విష్ణు కథ'కు సీక్వెల్ ఉందండోయ్! 

‘వినరో భాగ్యము విష్ణు కథ’కు సీక్వెల్ ఉందండోయ్! 

కిరణ్ అబ్బవరం హీరోగా బన్నీవాసు నిర్మించిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ నిన్ననే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాతో మురళీ కిశోర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. తిరుపతి నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాలో, కథానాయికగా కశ్మీర పరదేశి నటించింది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో మొదలైన ఈ కథ, లవ్ .. కామెడీ .. యాక్షన్ తో పాటు సస్పెన్స్ ను టచ్ చేస్తూ కొనసాగింది. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

యూ ట్యూబర్ గా మంచి క్రేజ్ తెచ్చుకోవాలనే ఆరాటం ఎక్కువగా ఉన్న హీరోయిన్, ఒక సెన్సేషనల్ వీడియో చేయాలనే ఉద్దేశంతో ఒక మర్డర్ కేసులో చిక్కుకుంటుంది. ఒక సాధారణ యువకుడిగా ఉన్న హీరో, ఆమె ఆ హత్య చేయలేదని నమ్ముతాడు. కానీ ఆ విషయాన్ని న్యాయస్థానం నమ్మాలి.  అందుకు సంబంధించిన ఆధారాలను సంపాదించడం కోసం హీరో రంగంలోకి దిగుతాడు. ఆ ప్రయత్నంలో ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే కథ.

కథాకథనాలు ..  ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసిన తీరు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫైట్స్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గర కథ ముగింపు దగ్గరికి చేరుకుంటుంది. ఏ విషయం రివీల్ అవుతుందా అన్ని ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. సీక్వెల్ కోసం వెయిట్ చేయవలసిందే అనే హింట్ ను అప్పుడు ఇచ్చారు. సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, సీక్వెల్ కోసం ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనేది చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్