Saturday, November 23, 2024
HomeTrending Newsఆన్ లైన్ బోధన కూడా ఉండాలి - హైకోర్టు

ఆన్ లైన్ బోధన కూడా ఉండాలి – హైకోర్టు

Online Teaching : తెలంగాణలో కరోనా పరిస్థితులపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణతోపాటు ఆన్ లైన్ బోధన కూడా కొనసాగించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్ లైన్ బోధన కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్ లో మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని  హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. సమ్మక్క జాతరలో కోవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేయాలన్న హైకోర్టు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ వద్ద జరుగుతున్న సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఏజీకి తెలిపిన హైకోర్టు.

నిర్లక్ష్యం వల్ల కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, తాజా పరిస్థితులపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశం. కరోనా పరిస్థితులపై విచారణ ఈనెల 20కి వాయిదా వేసిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం.

Also Read : సంపాదన అంతా విద్యార్థులకే

RELATED ARTICLES

Most Popular

న్యూస్