Friday, November 22, 2024
HomeసినిమాChangure Bangaru Raja: కథపై మరింత కసరత్తు జరగాల్సిందేమో!

Changure Bangaru Raja: కథపై మరింత కసరత్తు జరగాల్సిందేమో!

Mini Review: ఈ మధ్య కాలంలో గ్రామీణ నేపథ్యంలోని కథలు ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కథ ఏ మాత్రం బాగున్నప్పటికీ, వెంటనే కనెక్టు అవుతున్నాయి. అలాంటి విలేజ్ నేపథ్యంలో వచ్చిన మరో సినిమానే ‘ఛాంగురే బంగారు రాజా’. కార్తీక్ రత్నం కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, నిన్ననే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాకి రవితేజ నిర్మాత కావడం విశేషం. సతీశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో, గోల్డి నిస్సీ హీరోయిన్ గా పరిచయమైంది.

కార్తీక్ రత్నం ఇంతవరకూ చేస్తూ వచ్చిన సినిమాల తరహాలోనే ఈ సినిమా కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆయన ‘బంగార్రాజు’ పాత్రలో బైక్ మెకానిక్ గా కనిపిస్తాడు. ఆ ప్రాంతంలో రంగురాళ్ల వేట ఒక రేంజ్ లో జరుగుతూ ఉంటుంది. బంగార్రాజు జీవితం హ్యాపీగా సాగిపోతున్న సమయంలో అతను ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసులో నుంచి ఆయన ఎలా బయటపడ్డాడు? రంగురాళ్ల నేపథ్యంలో జరిగే మతలబులు ఎలాంటివి? అనే అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది.

విలేజ్ నేపథ్యం .. రంగురాళ్ల వ్యవహారం .. మర్డర్ మిస్టరీ .. ఈ సినిమాలో ఆసక్తిని కలిగిస్తాయి. ఒక వైపున సత్య .. మరో వైపున రవిబాబు నవ్వించడానికి ట్రై చేశారు. అయితే పాత్రలను సరిగ్గా డిజైన్ చేసుకోకపోవడం .. సన్నివేశాలను పెర్ఫెక్ట్ గా అల్లుకోకపోవడం .. ఆర్టిస్టుల నుంచి పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోవడం కనిపిస్తుంది. ఈ కారణంగా ఆశించిన స్థాయిలో ఈ కథ కనెక్ట్ కాలేదేమో అనిపిస్తుంది. కథపై మరింత కసరత్తు చేసి ఉంటే బాగుండేదేమో అనిపించకమానదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్