Saturday, January 18, 2025
Homeసినిమావిజ‌య్, పూరి కాంబినేషన్ లో మూడో సినిమా?

విజ‌య్, పూరి కాంబినేషన్ లో మూడో సినిమా?

Third One: సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ లైగ‌ర్. బాక్సింగ్ నేప‌థ్యంలో విభిన్న‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ పాన్ ఇండియా మూవీలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ న‌టించ‌డంతో ‘లైగ‌ర్’ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. విజ‌య్, మైక్ టైస‌న్ తండ్రీకొడుకులుగా న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. ఆగ‌ష్టులో లైగ‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

ఈ సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే.. పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో జనగణమన చిత్రం చేస్తున్న‌ట్టుగా అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. ఇందులో విజ‌య్ స‌ర‌స‌న‌ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. పూరి కనెక్ట్స్, శ్రీకార స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో సినిమా తెరకెక్కనుంది. ఇక అసలు విషయానికొస్తే… ఈ ఇద్దరు క‌లిసి ముచ్చ‌ట‌గా మూడో సినిమా చేయ‌నున్నార‌ట‌.

ఈ సినిమా కథను పూరి ఆల్రెడీ సిద్దం చేసేశాడట. విజ‌య్ ను చాలా ప‌వ‌ర్ ఫుల్ గా చూపించ‌బోతున్నార‌ని టాక్. ‘జనగణమన’ చిత్రం చివరి దశలో ఉండగానే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళతారని స‌మాచారం. ఈ వార్త ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు ఇండ‌స్ట్రీలో ఒక హీరో, ఒక డైరెక్ట‌ర్ ఇలా వ‌రుస‌గా మూడు సినిమాలు చేయ‌లేదు. భ‌విష్య‌త్ లో కూడా జ‌రుగుతుందో లేదో… మరి.. ఈ క్రేజీ మూవీని త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారేమో చూడాలి.

Also Read విజ‌య్ సినిమా కోసం పూజా అంత తీసుకుందా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్