Sunday, January 19, 2025
Homeసినిమా'18 పేజెస్' నా ఫేవరెట్ మూవీ: అనుపమ

’18 పేజెస్’ నా ఫేవరెట్ మూవీ: అనుపమ

జీఏ 2 పిక్చర్స్ – సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘18 పేజిస్‘. నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్బంగా చిత్ర హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ “2020 లాక్ డౌన్ టైమ్ లో డైరెక్టర్ సూర్య ప్రతాప్ గారు ఈ స్టోరీ చెప్పారు. విన్నప్పుడే చాలా ఎగ్జైయిటింగ్ అనిపించింది వెంటనే సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను. ‘కార్తికేయ’ సినిమా కంటే ముందే దీనికి సైన్ చేశాను. నిఖిల్ తో ఈ రెండు సినిమాలతో జర్నీ చాలా హ్యాపీగా ఉంది. 18 పేజెస్ సినిమాతో పాటు కార్తికేయ సినిమా కూడా ప్యార్లల్ గా చేశాము. ఆది అడ్వెంచర్ మూవీ అయితే ..ఈ 18 పేజెస్ క్రెజీ లవ్ స్టోరీ.. కార్తికేయ బిగ్ హిట్ అవ్వడంతో మా పెయిర్ కు జనాల్లో మంచి పేరొచ్చింది. ఈ 18 పేజెస్ సినిమా కూడా కార్తికేయ సినిమాలాగే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను.

ఇప్పటి వరకు నేను చేసిన లవ్ స్టోరీస్ లో ఇది మాఫెవరెట్ మూవీ.. 18 పేజెస్ లో నందిని క్యారెక్టర్ చాలా టిఫికల్ గా ఉంటుంది. ప్రస్తుతం అందరూ ఈ క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్యారెక్టర్ మోస్ట్ ఫెవరెట్ క్యారెక్టర్. దీని గురించి ఎక్కువ చెప్పలేను. అది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. ప్రేమ లేకుండా ప్రపంంచమే లేదు. అలాగే ఎమోషన్స్ లేకుండా లైఫ్ ఉండదు. కాబట్టి ప్రేమ కథలు కచ్చితంగా ఉండాలి. ఉంటాయి. ఈ సినిమా కూడా ప్యూర్లీ 100% లవ్ స్టోరీ కాబట్టి అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మనకు తెలియకుండా జరిగిన విషయామే లవ్..మనం క్యాలిక్యూలెట్ చేసి చేసేది ఆరెంజ్డ్ లవ్.కాబట్టి ప్రేమించడానికి రీజన్ ఉండదు. ఎందుకు ప్రేమిస్తున్నాను అంటే దానికి ఆన్సర్ ఉండదు అదే డైలాగ్ ఇందులో పెట్టడం జరగింది అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్