Friday, May 9, 2025
HomeTrending NewsRoja on Balakrishna: తొడలు కొట్టటానికి ఇది సినిమాకాదు, అసెంబ్లీ

Roja on Balakrishna: తొడలు కొట్టటానికి ఇది సినిమాకాదు, అసెంబ్లీ

శాసనసభలో నేడు టీడీపీ శాసనసభ్యులు రౌడీలు, గూండాల్లా వ్యవహరించారని, సభా సాంప్రదాయాన్ని పాటించకుండా అత్యంత జుగుప్సాకరంగా రచ్చ చేశారని రాష్ట్ర పర్యాటక, యువజన, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా  ఆరోపించారు. స్పీకర్‌ ఎదుటనున్న మానిటర్‌ను లాగేస్తూ.. వారి మంచినీళ్ల గ్లాసును ఎత్తి పడేసి పగులకొట్టారని అన్నారు. ఏపీ సచివాలయంలోని మీడియా పాయంట్ వద్ద ఆమె మాట్లాడారు.

బాలకృష్ణ దృష్టిలో అసెంబ్లీ అంటే సినిమా షూటింగ్‌ అనుకుంటున్నాడేమోనని, నిండు సభలో మీసం మెలేసి తొడగొడట్టమేంటని ప్రశ్నించారు. “నువ్వు మీసం మెలేసి తొడ కొడితే ఇక్కడ భయపడేవాళ్లెవరూ లేరు. నాతోపాటు తొమ్మిదేళ్లుగా బాలకృష్ణ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. హిందూపురం నియోజకవర్గం గురించి గానీ.. అక్కడ ప్రజల గురించికానీ, ఏరోజూ పట్టించుకోని బాలకృష్ణ- ఈరోజు శాసనసభకొచ్చి బావ కళ్లల్లో ఆనందం చూడటానికి తెగ ఆరాట పడుతున్నాడు. ఈ మీసాలు తిప్పడమేంటో.. వాళ్ల నాన్న మీద వైశ్రాయ్‌ హోటల్‌ దగ్గర చంద్రబాబు చెప్పులేయించినప్పుడు చేసుంటే బాగుండేది. అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు హర్షించేవారు. కానీ, స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణంలో దొంగగా ఆధారాలతో సహా దొరికి చంద్రబాబు జైలుకెళ్తే.. ప్రజలకు కోర్టులు, చట్టాల పట్ల నమ్మకం కలిగిన తరుణంలో బాలకృష్ణ ఈ స్థాయికి దిగజారడం నీచాతీనీచంగా చూడాలి” అంటూ బాలయ్యపై మండిపడ్డారు.

తమ అధినాయకుడు స్కిల్‌స్కామ్‌లో అవినీతి చేసినట్లు అన్నీ ఆధారాలుండబట్టే జైలుకెళ్లాడనేది టిడిపి సభ్యులకు  కూడా తెలుసని,  దీనిపై ఆధారాలని శాసనసభలో పెద్దపెద్ద స్క్రీన్‌లపై డిస్‌ప్లే చేసి మరీ చూపిస్తామనే  భయంతోనే వారు  రివర్స్‌ డ్రామాకు తెరదీశారన్నారు. కేవలం జనాల్లో పబ్లిసిటీ కోసమే ఈరోజు అసెంబ్లీకొచ్చి ఓవరాక్షన్‌ చేస్తున్నారని రోజా విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్