Monday, February 24, 2025
HomeTrending NewsKottu Satyanarayana: బాబు నుంచే పవన్ కు ప్రాణ హాని: డిప్యూటీ సిఎం కొట్టు

Kottu Satyanarayana: బాబు నుంచే పవన్ కు ప్రాణ హాని: డిప్యూటీ సిఎం కొట్టు

కాపుల ఓట్ల కోసమే పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు వాడుకుంటున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. బాబు చెప్పిన మాటలు విని పవన్ అవగాహనా రాహిత్యంతో మంత్రులపై, సిఎం జగన్ పై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ ను ఎవరికైనా చూపించాలంటూ ప్రజలు కోరుతున్నారని ఎద్దేవా చేశారు. వారాహి యాత్ర పేరుతో తిరుగుతున్న పవన్ కాపులను కించపరిచేలా మాట్లాడుతున్నారని.. ఆయన వెంట నడిచేందుకు కాపులు సుముఖంగా లేరని అభిప్రాయపడ్డారు. తాడేపల్లిగూడెం లో డిప్యూటీ సిఎం కొట్టు మీడియాతో మాట్లాడారు.

అసలు పవన్ కు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే హక్కు ఉందా అని ప్రశ్నించారు. ఆయనకు ఏదైనా ప్రాణహాని ఉంటే అది చంద్రబాబునుంచే ఉంటుందన్నారు. గత టిడిపి పాలనలో కృష్ణాజిల్లాలో పుష్కరాల పేరిట 44 దేవాలయాలను కూల్చి వేశారని, తమ పాలనలో 250 ఆలయాలకు 281 కోట్ల రూపాయలు కేటాయించామని వెల్లడించారు. తన పరిపాలన చూపి ప్రజలను ఓట్లు అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని సవాల్ చేశారు. ప్రజలు చంద్రబాబును ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. లోఫర్ లాంటి బాబు, జోకర్ లాంటి లోకేష్ మాటలను పవన్ నమ్మవద్దని సూచించారు. సిఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమం అందుతోందని, వచ్చే ఎన్నికల్లో మరోసారి సిఎం జగన్ కే అధికారం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్