Monday, September 23, 2024
Homeసినిమామహేష్‌ మూవీలో ముగ్గురు బాలీవుడ్ హీరోలు..?

మహేష్‌ మూవీలో ముగ్గురు బాలీవుడ్ హీరోలు..?

మహేష్ బాబు, రాజమౌళి ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీ గురించి గత కొంతకాలంగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 9న ఈ భారీ పాన్ వరల్డ్ మూవీని ప్రకటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. రాజమౌళి ఏ సినిమా చేసినా.. ఎవరితో వర్క్ చేసినా.. సినిమా షూటింగ్ కు ముందు వర్క్ షాపు అంటూ స్టార్ట్ చేసి సినిమా గురించి ఆయా నటీనటులు, సాంకేతిక నిపుణులకు ట్రైనింగ్ ఇస్తుంటారు.

ఇప్పుడు మహేష్‌ తో చేయనున్న సినిమాకి కూడా అలాంటి వర్క్ షాపును స్టార్ట్ చేయనున్నారని తెలిసింది. డిసెంబర్ లో ఈ వర్క్ షాపు స్టార్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వర్క్ షాపులో మహేష్‌ లుక్ ఎలా ఉండాలి..? మిగిలిన క్యారెక్టర్స్ ఏంటి..? అనేది క్లారిటీ వస్తుందట. అయితే.. ఈ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ హీరోలు నటించనున్నారట. ఈ వార్త తెలిసినప్పటి నుంచి ఈ సినిమాలో నటించే ఆ ముగ్గురు బాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరు అనేది ఆసక్తిగా మారింది. రాజమౌళి అడగాలే కానీ.. ఎవరైనా నటించడానికి రెడీగా ఉంటారు.

ఇక బడ్జెట్ విషయానికి వస్తే.. దాదాపు 1500 కోట్లు అని తెలిసింది. దీంతో ఇండియాలోనే హయ్యస్ట్ బడ్జెట్ తో రూపొందే సినిమాగా నిలిచింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇందులో బాలీవుడ్ నటీనటులతో పాటు హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కూడా నటించనున్నారని సమాచారం. మొత్తానికి జక్కన్న మహేష్‌ బాబుతో సినిమాని ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్