ఆంధ్ర ప్రదేశ్ సమగ్రాభివృద్ధికి, సమానాభివృద్ధికి పరిపాలనా వికేంద్రీకరణే శరణ్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు అన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా పలాసలో నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో రాజధాని పెట్టి, అక్కడే అభివృద్ధి చేయడం మంచి కాదని.. భవిష్యత్తులో మళ్ళీ ప్రాంతాల మధ్య విభేదాలు వస్తాయని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అమరావతి లో గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మిస్తే ఏ కారణాలతో అయితే తెలంగాణా విడిపోయిందో అలాగే ఏపీ మరోసారి మూడు ముక్కలు అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానులపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలదే అని కేంద్ర ప్రభుత్వం కూడా అఫిడవిట్ ద్వారా చెప్పిందన్నారు.
సిఎం జగన్ సంకల్పం ఎంతో గొప్పదని, పాదయాత్రలో ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకున్నారని, ఏం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందో ఆయనకు బాగా తెలుసని అప్పలరాజు స్పష్టం చేశారు. మూడు రాజధానులపై సుప్రీం కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తామని, అవసరమైతే మరోసారి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని, పరిపాలనా వికేంద్రీకరణ చేస్తామని వెల్లడించారు.
Also Read: మీరు టిడిపినే ఆక్రమించారు : సీదిరి