Saturday, January 18, 2025
Homeసినిమాఈ వారం థియేటర్లకు వస్తున్న సినిమాలు ఇవే!

ఈ వారం థియేటర్లకు వస్తున్న సినిమాలు ఇవే!

ప్రతి ఏడాది వేసవిని టార్గెట్ గా పెట్టుకుని పెద్దసంఖ్యలో థియేటర్లకు సినిమాలు వస్తుంటాయి. కానీ ఈ సారి విపరీతమైన ఎండల వలన, థియేటర్లకు రావడానికి కూడా ప్రేక్షకులు భయపడ్డారు. అందువలన చాలా సినిమాలు షోస్ కేన్సిల్ చేసుకోవలసి వచ్చింది. ఇక ‘ప్రసన్న వదనం’ వంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాల సంగతి కూడా ఆడియన్స్ కి తెలియకుండా పోయింది. ఇక ‘లవ్ మీ’ మాత్రం వైష్ణవి చైతన్యకి గల క్రేజ్ తో మంచి వసూళ్లనే రాబడుతోంది.

ఈ నేపథ్యంలో ఈ వారం థియేటర్లలో దిగిపోవడానికి మూడు సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఆ జాబితాలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ .. ‘ భజే వాయు వేగం’ .. ‘గం గం గణేశా’ ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చినవే.  కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా నేహా శెట్టి అలరించనుంది. కీలకమైన పాత్రలో అంజలి కనిపించనుంది. ‘గామి’ తరువాత విష్వక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు ఉన్నాయి.

ఇక కార్తికేయ చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అలాంటి సక్సెస్ ఈ సారి ఖాయమనే నమ్మకంతో ఆయన చేసిన సినిమానే ‘భజే వాయు వేగం’. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, కార్తికేయ బాడీ లాంగ్వేజ్ కి తగినదే. ఆయన సరసన నాయికగా ఐశ్వర్య మీనన్ నటించింది. ఇక ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా ఉదయ్ శెట్టి పరిచయమవుతున్నాడు. ప్రగతి శ్రీవాత్సవ – నయన్ సారిక కథానాయికలుగా పరిచయమవుతున్నారు. మరి ఈ వారం ఈ మూడు సినిమాల్లో ఏది ఎక్కువ మార్కులు కొట్టేస్తుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్