Tuesday, January 21, 2025
HomeTrending Newsమోడీ కేబినేట్ లో రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీనివాసవర్మ

మోడీ కేబినేట్ లో రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీనివాసవర్మ

ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర క్యాబినెట్ లో ముగ్గురికి చోటు దక్కింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరికీ….శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు బిజెపి నుంచి నరసాపురం లోక్ సభ సభ్యుడు  శ్రీనివాస వర్మ మోడీ 3.0  క్యాబినెట్ లో చేరుతున్నారు. వీరిలో రామ్మోహన్ నాయుడికి కేబినేట్ పదవి కాగా, మిగిలిన ఇద్దరికీ సహాయమంత్రి హోదాలో అవకాశం ఇచ్చారు.  ఢిల్లీలోని రోడ్ నంబర్ 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లోని తన అధికారిక నివాసంలో కేబినేట్ లో తీసుకుంటున్న ఎంపీలతో నరేంద్ర మోడీ భేటీ అయ్యారు  వంద రోజుల్లో రాబోయే వంద రోజులకు సంబంధించి యాక్షన్ ప్లాన్ ను వారికి వివరించారు అసంపూర్తిగా ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని వారికి సూచించారు

వీరితోపాటు తెలంగాణ నుంచి ఇప్పటికే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కూడా అవకాశం కల్పించారు దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి కేంద్ర కేబినేట్ లో చోటు దక్కినట్లు అయింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్