Sunday, January 19, 2025
Homeసినిమాతెలుగు ఆడియో రంగంలోకి ప్రవేశించిన టిప్స్ మ్యూజిక్

తెలుగు ఆడియో రంగంలోకి ప్రవేశించిన టిప్స్ మ్యూజిక్

Tips Music: టాలీవుడ్  నుంచి రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రాలు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’, స‌మంత‌ ‘శాకుంతలం’ గ్లోబల్ మ్యూజిక్ హక్కులను టిప్స్ ఇండస్ట్రీస్ చేజిక్కించుకుంది. ఈ రెండు చిత్రాలు 2022లో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద సంగీత సంస్థల్లో ఒకటైన టిప్స్ ఇండస్ట్రీస్ కొత్త ఏడాది ప్రారంభంలోనే ఈ రెండు బిగ్ ప్రాజెక్ట్స్ మ్యూజిక్ రైట్స్ పొంది సరికొత్త ఉత్సాహంతో మరో సంచలనం సృష్టించింది.

ఇప్పటికే శాకుంతలం, హరి హర వీర మల్లు చిత్రాల గ్లింప్స్ విడుదలై ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ సినిమాల మ్యూజికల్ టీజర్స్‌పై ఆసక్తి రెట్టింపయింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ నటీనటులు నటించిన హరి హర వీర మల్లు,  శాకుంతలం, రెండు చిత్రాల బిజినెస్  పరిశ్రమకే సరికొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తుందని చెబుతున్నారు సినీ విశ్లేషకులు.

ఈ సందర్భంగా  టిప్స్ మ్యూజిక్ అధినేతలు కుమార్ తౌరానీ, గిరీష్ తౌరానీ మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా భారతీయ చలనచిత్ర పరిశ్రమ అంతటా ఎన్నో అద్భుతమైన భారీ  చిత్రాలని నిర్మించిన సంస్థ టిప్స్. అంతే కాకుండా పాటలు, సంగీతాన్ని అందించిన టిప్స్ మ్యూజిక్.. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అదే నిబద్ధతతో ప్రస్తుతం తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించింది. ఇక పై తెలుగు చిత్రాల ఆడియో హక్కులతో పాటు భారతీయ అన్ని భాషల ఆడియో హక్కులను కొనడానికి సిద్ధంగా వుంది. కేవలం భారీ చిత్రాలనే కాకుండా చిన్న చిత్రాలు  సైతం మా సంస్థ  ఆడియో  విడుదల చేయడానికి ముందుంటుంది.

శాకుంతలం, హరిహర వీరమల్లు వంటి అద్భుతమైన చిత్రాల ఆడియో హక్కులతో పాటు… మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ DTS (డేర్ టూ స్లీప్) మణి శంకర్, లాంప్, రా రా పెనిమిటి, ధగఢ్ సాంబా, పరమపద సోపానం, యు అర్ మై హీరో, మై నేమ్ ఈజ్ శృతి, చిత్రాల ఆడియో  హక్కులు పొంది ఉన్నామని మీకు తెలియ చేస్తున్నాం. ఇప్పటికే మా టిప్స్ యూ ట్యూబ్ ఛానల్ కు 51 మిలియన్ సభ్యులు వున్నారు ప్రతి చిత్రం ప్రచారంలో భాగంగా  చిన్న పెద్ద సినిమా అనేది తేడా లేకుండా ప్రతీ సినీ ప్రేమికుడికి మా మాధ్యమం ద్వారా చేరుతుందని తెలియచేస్తూన్నాం.  మా మిత్రుడు ఆడియో రంగంలో  సుపరిచితుడు ‘సుప్రీం’ రాజు హార్వాణి సౌత్ ఇండియన్ మూవీస్ వ్యాపార  లావాదేవులను నిర్వహిస్తారు. ప్రేక్షకులకు క్లాసీ, వినోదాత్మక సంగీతాన్ని అందించాలానే సంకల్పంతో టిప్స్ ఇండస్ట్రీస్ మునుకెళ్తోంది అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్