Monday, February 24, 2025
HomeTrending Newsశ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వేదపండితుల మంత్రోచ్ఛారణాల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డా. జవహర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.  అక్టోబర్ 7 గురువారం నుంచి 15వ తేది వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

కోవిడ్ తీవ్రత కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.  ఏకాంత బ్రహ్మోత్సవాలు కావడంతో స్వర్ణరథం, మహరథం బదులుగా సర్వభూపాల వాహన సేవను స్వామివారికి నిర్వహిస్తామన్నారు. వాహనసేవలు ప్రతినిత్యం ఉదయం 9 గంటలకు, రాత్రి 7గంటలకు… గరుడ వాహన సేవను రాత్రి 7:30 గంటలకు జరుపుతామన్నారు. చక్రస్నాన కార్యక్రమాన్ని ఆలయంలోని అద్దాల మహల్ లో చేపడతామని వివరించారు. రాష్ర్ట ప్రభుత్వం తరపున 11వ తేదిన సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.

11వ తేదిన బర్డ్ హస్పిటల్ ప్రాంగణంలో పిడియాట్రిక్ కార్డియాక్ హస్పిటల్, గో మందిరం, అలిపిరి నడక మార్గాన్ని సిఎం ప్రారంభిస్తారని,  12వ తేదిన అదనపు బూందీ పోటు, యస్వీబిసి కన్నడ, హిందీ చానల్స్ ని ప్రారంభోత్సవంలో పాల్గొంటారని, కన్నడ చానల్ ప్రారంభోత్సవంలో కర్నాటక సియం బసవరాజ్ బోమ్మై కూడా పాల్గొంటారని సుబ్బారెడ్డి వెల్లడించారు

రాష్ట్రంలోని 13 జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులను ఉచితంగా దర్శనానికి అనుమతిస్తామని, టిటిడి తరఫున వాహనాలు ఏర్పాటు చేసి భక్తులను ఉచితంగా తిరుమలకు తీసుకు వస్తామని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్