Monday, May 20, 2024
HomeTrending Newsఅరుణాచల్ రాష్ట్రంలో వరుస భూకంపాలు

అరుణాచల్ రాష్ట్రంలో వరుస భూకంపాలు

హిమాలయాల్లో ఒదిగినట్టుండే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని కొద్ది రోజులుగా వరుస భూకంపాలు భయకంపితులను చేస్తున్నాయి. రాజధాని ఇటానగర్ కు వాయువ్యంగా ఈ రోజు సాయంత్రం 7.30 నిమిషాలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలోజి(NCS) వెల్లడించింది. ఆస్థి, ప్రాణ నష్టం ఎంత జరిగింది వివరాలు తెలియాల్సి ఉంది.

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ నెలలోనే నాలుగు సార్లు భూకంపం రావటంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఐదో తేదిన పంగిన్ ప్రాంతంలో భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. అంతకు ముందు రోజు నాలుగో తేది సోమవారం బసర్ అనే ప్రాంతంలో భూమి కంపించింది. ఇది రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. ఈ నెల రెండో తేదిన బసర్ ప్రాంతంలోనే భూకంపం రాగా 4.1గా నమోదైంది. వారం రోజుల్లోనే నాలుగు సార్లు భూకంపం రావటంతో శాస్త్రవేత్తలు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొనేందుకు ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాల్ని కేంద్రం అప్రమత్తం చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్