Sunday, February 23, 2025
HomeTrending Newsక్యాపిటల్ కాదు, క్యాపిటలిస్టుల సభ : రోజా

క్యాపిటల్ కాదు, క్యాపిటలిస్టుల సభ : రోజా

Capitalists Meeting:
తిరుపతిలో నిన్న జరిగింది అమరావతి క్యాపిటల్ సిటీ కోసం జరిగిన సభ కాదని, క్యాపిటలిస్టుల కోసం జరిగిన సభగా వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే ఆర్కే రోజా అభివర్ణించారు. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా మూడు రాజధానుల వల్ల తమ రేట్లు పడిపోయాయని బాధతో నిర్వహించుకున్న సభ అని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులు కూడా పన్నులు కడుతున్నారని, కానీ కేవలం అమరావతినే, అందులోనూ ఆ 29 గ్రామాల ప్రజలు మాత్రమే సంతోషంగా ఉండాలన్న చందంగా వారి ఆందోళన ఉందన్నారు.

కొంతమంది నేతలు ఇన్ని రోజులపాటు ముగుసులు వేసుకొని, ఎక్కడెక్కడో చాటుగా సమావేశాలు జరుపుకోవడం చూశామని, కానీ నిన్నటి సభతో అందరూ ముసుగులు తీసేసి ఒకే వేదికపై చేరారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో కలిసి ఎవరెవరు ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారో, సిఎం జగన్ మీద విషం చిమ్మాలనుకుంటున్నారో, ప్రజల జీవితాలు నాశనం చేయాలనుకుంటున్నారో రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని రోజా స్పష్టం చేశారు.

Also Read :  అమరావతిని కాపాడుకుందాం: బాబు

RELATED ARTICLES

Most Popular

న్యూస్