Wednesday, April 2, 2025
HomeసినిమాUgram: 'ఉగ్రం' పవర్ ఫుల్ టైటిల్ సాంగ్ విడుదల

Ugram: ‘ఉగ్రం’ పవర్ ఫుల్ టైటిల్ సాంగ్ విడుదల

‘నాంది’ లాంటి హిట్ సినిమా అనంతరం అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వస్తోన్న తాజా చిత్రం ‘ఉగ్రం’.  ప్రమోషనల్ కంటెంట్‌ ఈ సినిమాపై అంచనాలను  పెంఛి  మరో పెద్ద హిట్ అందించనున్నట్లు భరోసా ఇచ్చింది. తాజాగా ఉగ్రం టైటిల్ సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్.  శ్రీ చరణ్ పాకాల ఈ టైటిల్ ట్రాక్ ని హైలీ పవర్ ఫుల్ నెంబర్ గా కంపోజ్ చేశారు. ఆయనే స్వయంగా పాడిన ఈ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది.

చైతన్య ప్రసాద్ ఈ పాటకు పవర్ ఫుల్ లిరిక్స్ అందించారు. టైటిల్ ట్రాక్ నరేష్ ఉగ్రరూపాన్ని ప్రజెంట్ చేసింది. చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. వేసవి కానుకగా మే 5న ఉగ్రం థియేటర్లలో విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్