Sunday, January 19, 2025
HomeTrending Newsముసుగు తొలగిపోయింది: పేర్ని కౌంటర్

ముసుగు తొలగిపోయింది: పేర్ని కౌంటర్

ఒక రాజకీయ పార్టీ పెట్టి తనతో సహా ఒక్కరు కూడా పోటీ చేయకుండా.. వేరే పార్టీకి మద్దతు ఇవ్వడాన్ని ఏమంటారని, ఇలాంటి నేతను ప్యాకేజ్ స్టార్ అనక ఏమనాలని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.  ‘ఎవడ్రా నా కొడుకులు, నిఖార్సైన పదహారణాల కాపు బిడ్డనురా, కల్తీ గిల్తీ జాన్తా  నై…. మేం జగన్ కు బానిసలమా? నాదెండ్ల మనోహర్ ఏమి చేస్తున్నాడు, నీ వొళ్ళు పిసుకుతున్నాడా?’ అని మండిపడ్డారు. ‘రాజకీయంగా నువ్వు ఏమి చేసుకున్నా జగన్ వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ హెచ్చరించారు. నీ మూలంగా నేను ఇప్పటికే దిగజారా, ఇంతకన్నా దిగజారలేను  అంటూ వ్యాఖ్యానించారు.

వచ్చే 175 స్థానాలకు పోటీ చేస్తే ప్యాకేజ్ స్టార్ అనే మాటను తాము విత్ డ్రా చేసుకుంటామని చెప్పారు. నిన్ను సోదరా అంటేనే నీకు అంత కడుపు రగిలితే వైసీపీలో ఉన్న కాపు ఎమ్మెల్యేలను నా కొడకల్లారా అంటే మరి మాకెంత కడుపు రగాలాలని ప్రశ్నించారు. ఈ బూతులన్నీ పవన్ చదివిన ఏ పుస్తకంలో రాశారని నిలదీశారు.  రాజకీయ నాయకుడికి వెంట కులం ఉంటుందా, ప్రజలు ఉంటారా అని నాని అడిగారు. కాపులు అత్యధిక శాతం వైసీపీ వెంట ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కూడా మా వెంటే ఉంటారని పేర్ని ధీమా వ్యక్తం చేశారు. కుల రాజకీయాలు  చేసే వారే కులాల గురించి మాట్లాడతారని, గతంలో నాకు కులం లేదని చెప్పిన  శుంఠన్నరశుంఠ ఎవరని నిలదీశారు.

పేర్ని మాట్లాడుతూ…

పవన్ ఇప్పటికైనా తన ముసుగు తీసినందుకు సంతోషంగా ఉంది.

ఇప్పటికైనా బిజెపితో విడిపోతున్నట్లు పరోక్షంగా ప్రకటించారు

దత్తపుద్రుడి ముసుగు తొలగిపోయింది, ఈ ముసుగు వెనక బాబు గులాం గిరీ ఉంది

ప్రజలను, తన అభిమాన సంఘాలను పవన్ మోసం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఓ పార్టీ పేరుతో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు

ఈ ముసుగు తీయమనే తాము నాలుగేళ్ల నుంచి మేం అడుగుతున్నాం

వైఎస్సార్సీపీ లో గూండాలు లేరు కాబట్టి ఆయన ఇంటికొచ్చి తిట్టాల్సిన అవసరంలేదు

గతంలో భారతీయ జనతా పార్టీని తిట్టిన నోరు తడి ఆరకముండే మళ్ళీ ఆ పార్టీ చంక ఎక్కారు.

రంగా గురించి మాట్లాడతారు, మరి టిడిపి హయాంలో ముద్రగడ కుటుంబాన్ని ముతక భాషలో మాట్లాడితే ఆరోజున ఏమయ్యావు?
అప్పుడు నోరు పడిపోయిందా? చెవుల్లో ఏమైనా పోసుకున్నావా?

నేనూ అనగలను, కానీ అది సంస్కారం కాదు.. నా కొడకా అని అనగలను..

ఒరేయ్ సన్నాసిన్నర సన్నాసి… నీ పెళ్ళిళ్ళ గురించి ఎవరికి అవసరం?

రాజకీయ ముఖ చిత్రం మారుతుందంతే ఇక ముసుగు తీస్తున్నారు, ఇద్దరూ కలిసి పోతున్నారు.

ఒక పెళ్లి చేసుకొని 30మంది స్టెఫినీ లు అంటూ మాట్లాడుతున్నావు, నీకు స్టెఫినీలు సప్లై చేసే కంపెనీ ఉందా?

ఒక పార్టీ అధ్యక్షుడు, పార్టీ కార్యాలయంలో అసభ్య పదజాలంతో ఇలా తిట్టడం ఇదే ప్రథమం

Also Read : వెధవల్లారా…:  వైసీపీ నేతలపై పవన్ నిప్పులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్