Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ENG vs RSA: మహారాణి మరణం – ఆటకు విరామం

ENG vs RSA: మహారాణి మరణం – ఆటకు విరామం

ఇంగ్లాండ్ మహారాణి ఎలిజబెత్‌ -2 మృతికి సంతాప సూచకంగా ఇంగ్లాండ్- సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతోన్న మూడవ, ఆఖరి రెస్ట్ రెండో రోజు ఆటను రద్దు చేశారు.

మూడు వన్డేలు, మూడుటి 20లు, మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తోంది.  వన్డే సిరీస్ లో మూడోది, నిర్ణయాత్మ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో 1-1 తో సిరీస్ డ్రా అయ్యింది. టి 20సిరిస్ ను 2-1తో సౌతాఫ్రికా గెల్చుకుంది.

ఇక మూడు  టెస్టుల సిరీస్ లో తొలి టెస్ట్ సౌతాఫ్రికా ఇన్నింగ్స్, 12  పరుగులతో విజయం సాధించగా, రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్, 85పరుగులతో గెలుపు సొంతం చేసుకుంది. మూడవ, ఆఖరి టెస్ట్ నిన్న లండన్ లోని కెన్నింగ్టన్ మైదానంలో ఆరంభమైంది. అయితే వర్షం కారణంగా తొలి రోజు మ్యాచ్ లో కనీసం ఒక్క ఓవర్ కూడా ఆడలేకపోయారు. ఇదే సమయంలో ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్-2 మరణవార్త తెలిసింది. దీనితో ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ నేడు రెండోరోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ఇంగ్లాండ్, న్యూ సౌత్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

ఈ టెస్ట్ మ్యాచ్ తో పాటు వివిధ దేశవాళీ టోర్నమెంట్ల లో జరగాల్సిన మ్యాచ్ లు కూడా రద్దు చేశారు. తదుపరి షెడ్యూల్ నుత్వరలో  ప్రకటిస్తామని నిర్వాహకులు వెల్లడించారు.

Also Read : బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 మృతి

RELATED ARTICLES

Most Popular

న్యూస్