Sunday, January 19, 2025
Homeసినిమాతిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్..

తిరుపతిలో నేడు ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో ప్రభాస్ ఈ తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈరోజు సాయంత్రం ‘ఆదిపురుష్’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్, తిరుపతిలో గ్రాండ్ గా జరగనుంది.సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.రామాయణంలో కొంత భాగాన్ని ఆదిపురుష్ సినిమాగా తీసిన సంగతి తెలిసిందే. అందుకే యూనిట్ లో సభ్యులంతా భక్తిభావంతో కనిపిస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా ప్రభాస్ కెరీర్ కు చాలా కీలకం. సాహో, రాధేశ్యామ్ డిజాస్టర్ల తర్వాత వస్తున్న ఈ సినిమా కచ్చితంగా హిట్టవ్వాలి. లేదంటే అతడి మార్కెట్ పై ఆ ప్రభావం పడుతుంది. అందుకే ఆదిపురుష్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు ఈ హీరో. ఇక ప్రీ-రిలీజ్ ఫంక్షన్ హైలెట్స్ విషయానికొస్తే.. ఈ వేడుకలో 50 అడుగుల ఆదిపురుష్ హోలోగ్రామ్ ను విడుదల చేయబోతున్నారు. ఇక ఆధ్యాత్మిక ప్రవచనకర్త చినజీయర్ స్వామి, ఈ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా వస్తున్నారు. ఇదే వేదిక పైనుంచి అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీ విరాళం ప్రకటించబోతోంది ఆదిపురుష్ యూనిట్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్