Sunday, January 19, 2025
Homeసినిమామారుతి-ప్ర‌భాస్ మూవీకి అడ్డుతగులుతోంది ఎవ‌రు?

మారుతి-ప్ర‌భాస్ మూవీకి అడ్డుతగులుతోంది ఎవ‌రు?

Brain wash: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్లో మూవీ రానుంద‌ని గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే.. ఎప్పుడో సెట్స్ పైకి వ‌స్తుంద‌ని టాక్ వినిపించింది కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. మూవీ మాత్రం ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని అంటున్నారు. మారుతి సైతం ప్ర‌భాస్ తో మూవీ ప‌క్కా అని ఓ ఇంట‌ర్ వ్యూలో చెప్పారు. అంతే కాకుండా.. బుజ్జిగాడు, మిస్ట‌ర్ ఫ‌ర్ ఫెక్ట్ త‌ర‌హాలో ఎంట‌ర్ టైనింగ్ గా ఉంటుంద‌ని కూడా చెప్పారు.

అయితే.. మారుతితో ప్ర‌భాస్ సినిమా చేయాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ని అయిన‌ప్ప‌టికీ.. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్ వెన‌క్కులాగుతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.  ప్రాజెక్ట్ కే అంటూ వందల కోట్ల సినిమా తాము తీస్తుంటే మధ్యలో ఇలాంటి ఎంటర్ టైనర్ చేయడం ఏమిటి అని ఆయన పదే పదే ప్రభాస్ ను క్వశ్చన్ చేస్తున్నారని టాలీవుడ్ ఇన్ సైడ్ టాక్. అయితే.. ఆయన మాటలను ప్రభాస్ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. మ‌రి.. ఈ మూవీ పై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్