Saturday, January 18, 2025
Homeసినిమాపునీత్ రాజ్‌కుమార్ ‘జేమ్స్’ ట్రేడ్‌మార్క్ సాంగ్ విడుదల

పునీత్ రాజ్‌కుమార్ ‘జేమ్స్’ ట్రేడ్‌మార్క్ సాంగ్ విడుదల

Puneeth: కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన పునీత్ ని ఇప్పటికీ కన్నడ సినీ పరిశ్రమ మరిచిపోలేకపోతోంది. ఒక్క కన్నడ పరిశ్రమ అనే కాదు.. ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ పునీత్‌ని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారంటే అతిశయోక్తి కానే కాదు. అంత మంచిమనసు ఉన్న మనిషి పునీత్ రాజ్ కుమార్ న‌టించింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ పవర్ స్టార్‌గా ఎనలేని కీర్తిని ఆయన సంపాదించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 1వ తేదీన పునీత్ రాజ్‌కుమార్ నటించిన ‘జేమ్స్’ చిత్రం నుండి ‘ట్రేడ్ మార్క్’ అనే వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేయబోతున్నారు.

 

పునీత్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియా ఆనంద్ నటించగా, విలన్‌గా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించారు. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రిపబ్లిక్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. పునీత్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. హీరో శ్రీకాంత్, విజయ్. ఎమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయినట్లుగా మేకర్స్ ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్