Monday, February 24, 2025
HomeTrending NewsHyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో నేడు, రేపు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నగరానికి రానున్న నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ రోజు సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు 17న ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సీటీఓ జంక్ష న్, పీఎన్బీ ఫ్లైఓవర్, జంక్షన్, హెచ్పీఎస్ స్కూల్ ఔట్ గేట్, బేగంపేట ఫ్లై ఓవర్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్, మొనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్ రోడ్, ఎంఎం. టీఎస్, వివి స్టాట్యూ జంక్షన్, పంజాగుట్ట జంక్షన్, ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు తలెత్తాయి.

సికింద్రాబాద్ నుంచి వయా బేగంపేట మీదుగా అమీర్‌పేట్, మెహదీపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సులు ఈ రూట్‌లో రాకుండా అప్పర్ ట్యాంక్బండ్‌పై దారి మళ్లించనున్నారు. రాజభవన్ రోడ్, మొనప్ప జంక్షన్, వీవీ స్టాచ్యూ భైరతాబాద్ ఈ మార్గాల్లో రెండు వైపులా రోడ్ మూసివేశారు. పంజాగుట్ట రాజభవన్ క్వార్టర్స్ రోడ్డులో వాహనాలకు అనుమతి లేదు. సీటీఓ జంక్షన్, మినిస్టర్ రోడ్డులో వచ్చే వాహనాలను రసూల్పరా జంక్షన్ వద్ద కొంత సమయం పాటు నిలిపివేస్తారు.

పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్ మీదుగా బేగంపేట ఎయిర్‌పోర్టు మీదుగా వచ్చే వాహనాలను ప్రకాష్ నగర్ టీ జంక్షన్ వద్ద కొంత సమయం నిలుపుదల చేస్తారు. ఈ రూట్‌లలో ప్రయాణించే వాహనదారులు ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని పోలీసుల సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్