Sunday, January 19, 2025
HomeTrending Newsమువ్వన్నెల జెండాలతో ట్యాంక్ బండ్

మువ్వన్నెల జెండాలతో ట్యాంక్ బండ్

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్ బండ్‌పై ఫ్రీడం ర్యాలీ ని నిర్వహించింది. ర్యాలీలో భాగంగా ట్యాంక్ బండ్ మొత్తం త్రివర్ణ శోభితంగా మారింది. ట్యాంక్ బండ్ తో పాటు నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ తదితర ప్రాంతాల్నిజాతీయ పతాకాలు..జాతీయ జెండాల రంగులు, లైటింగ్ తో ఆకట్టుకుంటోంది. హుస్సేన్ సాగర్ జలాశయంలో జాతీయ జెండాలతో సందడి చేస్తున్న పడవలు ఆకర్షిస్తున్నాయి.

ఈ రోజు ఉదయం నుంచి వరుసగా సాగుతున్న ర్యాలీలు, ప్రదర్శనలతో సందడిగా మారింది. ఫ్రీడం ర్యాలీలో మంత్రి తలసాని, హోం మంత్రి మహమూద్ అలీ, ఎంపీ కేకే, సీఎస్ సోమేష్ కుమార్ పాల్గొన్నారు. జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్‌పై భారీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఫ్రీడం ర్యాలీ నేపథ్యంలో పోలీసులు ట్యాంక్ బండ్ దారులన్నీ ట్రాఫిక్ డైవర్షన్ చేశారు

Also Read : దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా

RELATED ARTICLES

Most Popular

న్యూస్