Saturday, January 18, 2025
Homeసినిమాస్ట్రీమింగ్ కి వచ్చేసిన త్రిష వెబ్ సిరీస్ .. 'బృందా'

స్ట్రీమింగ్ కి వచ్చేసిన త్రిష వెబ్ సిరీస్ .. ‘బృందా’

ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాల తరువాత తెరపై కనిపించడం లేదు. కాస్త ఎక్కువ కాలం నిలబడిన హీరోయిన్స్ ఇంతకుముందున్న వారే. శ్రియ .. కాజల్ .. తమన్నా .. సమంత చాలా కాలం పాటు తమ జోరు చూపించారు. త్రిష కూడా ఆ జాబితాలోనే కనిపిస్తుంది. అయితే త్రిష తెలుగు సినిమాలు చేయక చాలా కాలమైంది. ఆమె చేతిలో ఉన్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలు పూర్తయితే, కొత్తగా అవకాశాలు రావడం కష్టమేననే టాక్ ఆ మధ్య వినిపించింది.

కానీ గ్లామర్ విషయంలో కేర్ తీసుకుంటూ వెళ్లిన త్రిష, మరింత గ్లామరస్ గా తయారైంది. మళ్లీ సీనియర్ స్టార్ హీరోల సరసన అవకాశాలను సంపాదించుకుంటోంది. ప్రస్తుతం భారీప్రాజెక్టులతో బిజీగా  ఉన్న త్రిష, ఇంత బిజీలోనూ వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టడం విశేషం. తెలుగులో ఆమె చేసిన ఆ వెబ్ సిరీస్ పేరే ‘బృందా’. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. సూర్య మనోజ్ వంగల దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఈ రోజు నుంచి ‘సోనీ లివ్’లో స్ట్రీమింగ్ అవుతోంది.

8 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ను నిర్మించారు. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల పాటు ఉంది. ఈ సిరీస్ లో పోలీస్ ఆఫీసర్ గా త్రిష కనిపించనుంది. హైదరాబాద్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. సిటీలో ‘తిలక్’ అనే ఒక రైల్వే ఎంప్లాయ్ హత్య జరుగుతుంది. ఆ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి వెళ్లిన ‘బృంద’కి కొన్ని అనూహ్యమైన నిజాలు తెలుస్తాయి. అవేమిటి? అప్పుడు ఆమె ఏం చేస్తుంది? అనేది కథ. ఆమని .. రవీంద్ర విజయ్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఆ సిరీస్ ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్