Monday, February 24, 2025
Homeసినిమాబాల‌య్య మూవీ లో త్రిష ఫిక్స్ అయ్యిందా..?

బాల‌య్య మూవీ లో త్రిష ఫిక్స్ అయ్యిందా..?

భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన‌ మణిరత్నం తెర‌కెక్కించిన లేటెస్ట్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 1’. ఈ భారీ చిత్రం తెలుగులో ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు కానీ తమిళంలో మాత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ‌నాడులో ఉన్న రికార్డులు అన్నింటినీ పొన్నియిన్ సెల్వ‌న్ బ‌ద్ద‌లు కొట్టింది. ఈ సినిమా విజయంతో త్రిషకి మళ్ళీ క్రేజ్ పెరుగుతోంది. ఈ సినిమాలో త్రిష చాలా అందంగా కనిపించింది. ఆమె 40కి చేరువలో ఉంది కానీ.. మణిరత్నం మాత్రం ఆమెని 30 ఏళ్ల యువతిలా ప్రెజెంట్ చేశారు.

దాంతో త్రిష‌కు మళ్ళీ అవకాశాలు పెరుగుతున్నాయి. తెలుగులో కూడా దర్శకులు ఆమెకి ఆఫర్లు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే… నందమూరి బాలకృష్ణ హీరోగా  డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. త్వ‌ర‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అయితే… ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ఎవరు అనేది ఫైనల్ కాలేదు. బాలకృష్ణకి కూతురుగా శ్రీలీల నటిస్తోంది.

అయితే.. పొన్నియన్ సెల్వన్ చూశాక త్రిషని తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నారట మేక‌ర్స్. ప్రస్తుతానికి అయితే.. ఆమెని అప్రోచ్ కాలేదు. గతంలో త్రిష‌.. బాలకృష్ణకు జంట‌గా లయన్ అనే సినిమాలో నటించింది కానీ.. ఆ సినిమా స‌క్సెస్ అవ్వ‌లేదు. అయిన‌ప్ప‌టికీ త్రిష‌ను బాల‌య్య మూవీ కోసం ఎంపిక చేస్తారేమో చూడాలి.

Also Read అదే జరిగితే .. త్రిష దశ తిరిగినట్టే! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్