అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో.. చిత్రాలు చేయడం.. ఈ మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడం తెలిసిందే. దీంతో ఈ కాంబో అంటే అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నాలుగవ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 చేస్తున్నాడు. త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత ఇద్దరూ కలిసి కొత్త సినిమా స్టార్ట్ చేయనున్నారు.
ఈ భారీ, క్రేజీ మూవీని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. త్వరలోనే ఈ సినిమాని అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. అయితే.. వీరిద్దరూ ఇప్పటి వరకు చిన్న యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనరే చేశారు కానీ.. ఇప్పుడు రూటు మార్చి ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ స్టోరీ కూడా రెడీగా ఉందట. ఓ వైపు బన్నీ, త్రివిక్రమ్ తమ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నప్పటికీ.. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా త్వరలో స్టార్ట్ చేయనున్నారని సమాచారం.
మరో విషయం ఏంటంటే.. త్రివిక్రమ్ ఇప్పటి వరకు పాన్ ఇండియా మూవీ చేయలేదు. ఇప్పుడు ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లోకి త్రివిక్రమ్ చేరనున్నారని తెలిసింది. ఈ యాక్షన్ కూడా చాలా స్టైలీష్.. హై ఓల్టేజ్ యాక్షన్ చూపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. బన్నీని ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. మరి… బన్నీ, త్రివిక్రమ్ నాలుగవ సారి కూడా సంచలనం సృష్టిస్తారేమో చూడాలి.