Sunday, January 19, 2025
Homeసినిమాపవన్ కు పాట రాసిన త్రివిక్రమ్

పవన్ కు పాట రాసిన త్రివిక్రమ్

Trivikram Lyrics To Pawans Bheemla Nayak :

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్‘ అందిస్తున్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర. భీమ్లా నాయక్ చిత్రం నుంచి మరో గీతం విడుదల అయింది. ఈ చిత్రానికి సంభాషణలు, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న త్రివిక్రమ్, ఈ గీతాన్ని రచించటం విశేషం. మాటల్లో మాత్రమే కాదు పాటలో సైతం తనదైన శైలిని పలికించారన్నది స్పష్టం చేస్తుందీ గీతం.

“పది పడగల పాము పైన పాదమెట్టిన సామి తోడు…
పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు నెత్తినోడు…” పాటలోని ఈ పదాలు వింటే నిజమనిపించక మానదు. భీమ్లా నాయక్ పోరాట సన్నివేశాల్లో భాగంగా ఈ గీతం కనిపిస్తుంది. తమన్ స్వరాలు, అరుణ్ కౌండిన్య గాత్రం ఆవేశాన్ని రగిలిస్తే, రెండు నిమిషాల ముప్ఫై సెకన్లు ఉన్న ఈ పాటలో కనిపిస్తున్న దృశ్యాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. భీమ్లా నాయక్ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Must Read :

‘భీం భీం భీం భీం భీమ్లానాయక్’ అంటూ దూసుకెళుతున్న సాంగ్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్