Sunday, January 19, 2025
Homeసినిమా'అ' సెంటిమెంటును పక్కన పెట్టిన త్రివిక్రమ్! 

‘అ’ సెంటిమెంటును పక్కన పెట్టిన త్రివిక్రమ్! 

త్రివిక్రమ్ తయారు చేసుకునే కథల్లో అన్నివర్గాల ప్రేక్షకులు కోరుకునే అంశాలు ఉంటాయి. అందువలన ఆయన సినిమాలను అన్ని తరగతుల ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఆయన డైరెక్షన్ లో తమ హీరో చేయాలని అభిమానులు కోరుకుంటారు. ఇక స్టార్ హీరోలు సైతం ఆయన సినిమాల్లో చేయడానికి ఆసక్తిని చూపుతుంటారు. ఆయన ప్రాజెక్టు కోసం వెయిట్ చేస్తుంటారు. ఒకసారి కలిసి పనిచేసిన హీరోతో మళ్లీ మళ్లీ కలిసి పనిచేయడం కూడా త్రివిక్రమ్ కి అలవాటే.

అలా ఆయన మహేశ్ బాబుతో కలిసి మరో సినిమా చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన ‘గుంటూరు కారం’ సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల కానుంది. ఇది పూర్తి మాస్ యాక్షన్ మూవీ అనే విషయాన్ని ఈ సినిమా టైటిల్ చెప్పేస్తుంది. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ తన సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడనే చెప్పాలి. 2016 నుంచి ఫాలో అవుతూ వస్తున్న సెంటిమెంటును ఈ సారి ఆయన పక్కన పెట్టేయడం ఆశ్చర్యమే.

2016లో ఆయన ‘అ ఆ’ సినిమాను తెరకెక్కించాడు. ఆ తరువాత ఆయన నుంచి ‘అజ్ఞాతవాసి’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్ఛాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిని అందుకోలేకపోయినా, ఆయన ఆ సెంటిమెంటును మాత్రం వదులుకోలేదు. ‘అరవిందసమేత’ .. ‘అల వైకుంఠపురంలో’ సినిమాలను తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అయినా ఈ సారి ఆయన మహేశ్ బాబు మూవీ విషయంలో ఆ సెంటిమెంట్ ను టచ్ చేయకపోవడం విశేషంగానే చెప్పుకోవాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్