Sunday, January 19, 2025
Homeసినిమావెంకీ .. నానీలతో త్రివిక్రమ్ మూవీ! 

వెంకీ .. నానీలతో త్రివిక్రమ్ మూవీ! 

ప్రస్తుతం త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను ప్లాన్ చేయడంలో బిజీగా ఉన్నాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. మహేశ్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ తరువాత సినిమాను త్రివిక్రమ్ ఎవరితో చేయనున్నాడనేది  ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే తెరపైకి వెంకటేశ్ – నానీ పేర్లు వచ్చాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక ప్రాజెక్టును త్రివిక్రమ్ ప్లాన్ చేశాడనే టాక్ వినిపిస్తోంది.

నిజానికి మహేశ్ తో సినిమా తరువాత త్రివిక్రమ్ సినిమా బన్నీతో ఉండనున్నట్టుగా వార్తలు వచ్చాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ రికార్డు ఉంది. అందువలన ఈ కాంబినేషన్ పై బన్నీ ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా ఉన్నారు. అయితే ‘పుష్ప 2’ ప్రాజెక్టు విషయంలో ఆలస్యమైనా, ఒకవేళ బోయపాటి ప్రాజెక్టునే ముందుగా చేయాలని బన్నీ అనుకున్నా, వెంకీ ప్రాజెక్టును త్రివిక్రమ్ ముందుకు తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు.

వెంకటేశ్ హీరోగా చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ‘మల్లీశ్వరి’ సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశాడు. ఆ సినిమాలను ఆడియన్స్ ఇప్పటికీ మరిచిపోలేదు. వెంకీతో ఒక సినిమా ఉంటుందని  త్రివిక్రమ్ ప్రకటించి కూడా చాలా కాలమే అయింది. వెంకీతో పాటు నాని కూడా ఈ సినిమాలో ఉంటాడనీ .. ఇది మల్టీస్టారర్ అని అంటున్నారు. మల్టీ స్టారర్ సినిమాలు చేయడం వెంకీకి కొత్త కాదు. నానీ కూడా ఆల్రెడీ నాగార్జునతో ‘దేవదాస్’ చేశాడు. వెంకీ – నాని ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనేది చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్