Back to : టిఆర్ఎస్ నేత, ఖైరతాబాద్ కార్పొరేటర్ పి. విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రెండు పర్యాయాలుగా టిఆర్ఎస్ తరఫున కార్పొరేటర్ గా గెలిచిన ఆమె ఈ నెల 23న కాంగ్రెస్ లో చేరనున్నారు. గత ఏడాది జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో చివరి వరకూ మేయర్ పదవిని ఆశించి భంగపడిన విజయారెడ్డి కేటిఆర్, దానం నాగేందర్ చొరవతో చివరి నిమిషంలో కౌన్సిల్ సమావేశానికి హాజరై ప్రస్తుత మేయర్ గద్వాల విజయలక్ష్మి అభ్యర్ధిత్వాన్ని బలపరిచారు.
నేడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏ ఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ లను విజయ కలుసుకున్నారు, తన తండ్రి చివరి వరకూ కాంగ్రెస్ లోనే కొనసాగారాని, సిఎల్పీ నేతగా పని చేశారని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో దేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎంతో అవసరమని అందుకే తాను కాంగ్రెస్ గూటికి తిరిగి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ నెల 23న జరిగే ఓ కార్యక్రమంలో తానూ కాంగ్రెస్ పార్టీలో లాంఛనంగా చేరనున్నట్లు వెల్లడించారు.
Also Read : ట్రిపుల్ ఐటి సమస్యల నెలవు – రేవంత్ రెడ్డి