Saturday, November 23, 2024
HomeTrending Newsటీఆర్ఎస్ దీక్ష విజయవంతం: కవిత

టీఆర్ఎస్ దీక్ష విజయవంతం: కవిత

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 24 గంటల్లో ధాన్యం సేకరణపై తన వైఖరిని మార్చుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రైతుల ‌పక్షాన ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన దీక్ష విజయవంతమైందన్న ఎమ్మెల్సీ కవిత, ఇప్పటికైనా బీజేపీ నేతలు కళ్ళు తెరవాలన్నారు. బీజేపీ ప్రభుత్వ తీరు మారకపోతే, వచ్చేసారి ఢిల్లీలో తెలంగాణ రైతులతో కలిసి కొట్లాడుతామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

సీఎం కేసీఆర్ గారి‌ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతులకు అండగా నిలిచి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. అంతేకాదు, మోదీ ప్రభుత్వం రైతుల శక్తిని తక్కువగా అంచనా వేస్తోందన్న ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీలో తాము ధర్నా చేస్తుంటే, హైదరాబాద్ లో బీజేపీ దొంగ దీక్ష చేస్తుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతులకు పంటకు పెట్టిన కనీస ఖర్చు కూడా రావడం లేదని, అయినా క్రూరమైన బీజేపీ ప్రభుత్వానికి రైతుల పట్ల కనీస సానుభూతి కూడా లేదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.

మారిన పరిస్థితులకు అనుగుణంగా, ప్రభుత్వాలు నిర్ణయాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు కవిత. రైతులందరికీ ఒకే దేశం- ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలని‌ టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోందని‌ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్ర‌జలు, రైతులు సిద్ధంగా ఉన్నార‌ని, తాడోపేడో తేల్చుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.

Also Read : మోదీకి 24 గంట‌ల డెడ్‌లైన్..సిఎం కెసిఆర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్