ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ రోజు మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫాం హౌస్ నుంచి ప్రగతి భవన్ రానున్నారు. ఇవాళ ప్రగతి భవన్ లో సాయంత్రం 5.30 గంటల లు సిఎం కేసిఆర్ అధ్వర్యంలో ముఖ్యమైన సమావేశం జరగనుంది. అందుబాటులో ఉన్న మంత్రులు, పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీలో చీప్ విప్,విప్ లను సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశానికి అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్ లను కూడా ఆహ్వానించారు.
రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్డ్ వెలువడిన నేపథ్యంలో జరుగనున్న సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కేంద్రంలో,రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు,ఇతర అంశాలపై చర్చించే ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్ డి ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వటమా…యుపిఏ కూటమికి మొగ్గు చూపటంపై గులాబి నేతలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే దిశలో సీఎం కేసీఆర్ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతోపాటు ప్రాంతీయపార్టీ అధినేతలతో సమావేశం అయ్యారు. కొద్ది రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్ టీమ్‌తో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి సంబంధించి ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే.. రాబోయే పరిణామాలు.. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ సమీకరణాలు, దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ రాజకీయ పరిస్థితులపై ఈరోజు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించే అవకాశం కనిపిస్తోంది. వర్తమాన రాజకీయాలను పరిశీలిస్తే రెండు కూటములకు తెరాస సమ దూరం పాటించి ఈ దఫా తటస్థంగా ఉండనున్నారని విశ్వసనీయ సమాచారం.
Also Read : రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల