రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం వారికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించగా, అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల ఎంపీ సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుమలకు వచ్చిన ప్రతిసారి పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని, అన్నదమ్ముల స్ఫూర్తితో నేటికి రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని తెలిపారు.
మునుగోడు ఉపఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు నేరవేర్చేలా కృషి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్నే ప్రజలు విశ్వసిస్తున్నారని వెల్లడించారు.
Also Read : మునుగోడు పాఠం