Saturday, January 18, 2025
HomeTrending Newsటీఆర్‌ఎస్‌ పార్టీ పేరు మార్పుపై పబ్లిక్ నోటీస్

టీఆర్‌ఎస్‌ పార్టీ పేరు మార్పుపై పబ్లిక్ నోటీస్

తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీ పేరు మార్పుపై కీలక పరిణామం చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌ పార్టీగా మార్చుతున్నట్లు ఇప్పటికే పార్టీ నాయకత్వం ప్రకటించగా.. తాజాగా దీనిపై ఒక అడుగు ముందుకు పడింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు మార్పుపై టీఆర్‌ఎస్‌ పబ్లిక్‌ నోటీస్‌ ఇచ్చింది. Trs పేరును బిఆర్ఎస్ గా మారుస్తూ పబ్లిక్ నోటిసు ఇచ్చింది టిఆర్ఎస్.

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు మార్పుపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా తెలిపాలని.. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పేరుతో ఓ ప్రకటన వెలువడింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు మార్పుపై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా ఈసీకి తెలపాలని కోరింది. ప్రస్తుతం తెరాస పేరు మార్పు హాట్‌ టాపిక్‌ గా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్