Monday, January 20, 2025
HomeTrending Newsరైతాంగాన్ని మోసం చేస్తున్న‌ది మోదీనే : మంత్రి ఎర్ర‌బెల్లి

రైతాంగాన్ని మోసం చేస్తున్న‌ది మోదీనే : మంత్రి ఎర్ర‌బెల్లి

రైతాంగాన్ని మోసం చేస్తున్న‌ది ప్ర‌ధాని న‌రేంద్ర మోదీనే అని రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మండిప‌డ్డారు. రైతులు లాభ పడాలనే ల‌క్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నార‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం ఖానాపూర్ గ్రామంలో ప్రాథమిక రైతు సేవా సహకార సంస్థ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ద‌యాక‌ర్ రావు ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ‌పై క‌క్ష క‌ట్టింద‌ని మండిప‌డ్డారు. సీఎం కేసీఆర్ ప‌రిపాల‌న‌తో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందింద‌ని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా ప‌థ‌కాలు దేశానికే ఆద‌ర్శంగా నిలిచాయ‌న్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరానికి నీళ్లు అందించిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. సాగు నీరు, 24 గంటల కరెంట్, రైతు బంధు లాంటి ప‌థ‌కాల అమ‌లు వ‌ల్ల పంటలు బాగా పండిస్తున్నారు. దిగుబ‌డి కూడా పెరిగింద‌న్నారు. రైతులు పండించిన ప్రతి గింజను మన ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. పక్క రాష్ట్రాల రైతులు మన రాష్ట్రంలో పుట్టనందుకు బాధ పడుతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. సమస్యలు వస్తే వెంటనే వాటిని పరిష్కరించాల‌ని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్