మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 1౦,౩౦9 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. పాల్వాయి స్రవంతికి కనీసం డిపాజిట్ రాలేదు.
అన్ని రౌండ్స్, సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ లు కలిపి మొత్తం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
టీఆరెఎస్ : 97006.
బిజేపి : 86697.
కాంగ్రెస్: 23906.
మొత్తం అన్ని రౌండ్లు ముగిశాక టీఆరెఎస్ 10309 మెజారిటీ సాధించింది. భారత్ రాష్ట్ర సమితికి పునాది రాయి వేసి.. దేశ దృష్టిని మునుగోడు ఓటర్ల ఆకర్షించారని తెరాస నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు వోటింగ్ సరళి కొన్ని ప్రాంతాల్లో విభిన్నంగా ఉంది. అయితే టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి చిన్న షాక్ తగిలింది. కూసుకుంట్ల స్వగ్రామం లింగవారిగూడెంలో బిజెపి లీడ్ రావటం గమనార్హం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇన్చార్జిగా ఉండి ప్రచారం చేసిన లింగోజిగూడెంలో బిజెపికి ఆధిక్యం వచ్చింది. అటు మంత్రి మల్లా రెడ్డి ఇంచార్జి గా ఉన్న అరెగుడెం లో కూడా బీజేపీ ఆధిక్యం, మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇన్ ఛార్జ్ గా ఉన్న గ్రామంలో బిజెపి ఆధిక్యం సాధించింది.