Saturday, January 18, 2025
Homeతెలంగాణజూడాల సమస్యలు పరిష్కరించాలి : బండి సంజయ్

జూడాల సమస్యలు పరిష్కరించాలి : బండి సంజయ్

జూనియర్ డాక్టర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి డిమాండ్లకు మద్దతు తెలుపుతున్నామని… అయితే ప్రస్తుతం కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో సమ్మె చేయడం  సరికాదని హితవు పలికారు. జూడాల సమ్మెకు స్వయంగా ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని బండి సంజయ్ అన్నారు.  వైద్య సిబ్బంది కుటుంబ సభ్యులు కరోనా బారిన పడితే వారు ఎక్కడ కోరితే అక్కడ వైద్య సేవలు అందించాలన్నారు.

ముఖ్యమంత్రి ఇటీవల ఆస్పత్రుల సందర్శనలో ఏయే సమస్యలు గుర్తించారో చెప్పలేదని సంజయ్ ఎద్దేవా చేశారు. కరోనా కోసం 2,500 కోట్లు ఖర్చు చేశామంటున్న ప్రభుత్వం లెక్కల వివరాలు బహిర్గతం చేయాలన్నారు. సిఎం ఆస్పత్రులకు వస్తుంటే సినిమా సెట్టింగ్ లాగా ఏర్పాట్లు చేశారని, అక్కడకు వెళ్ళి నటించి వచ్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయని చూపించే ప్రయత్నం చేస్తున్నారని, తప్పుడు లెక్కలు చెపుతున్నారని సంజయ్ ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్