తెలంగాణా మంత్రివర్గం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం కానుంది. రెండో దశ కోవిడ్ రోజు రోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలు సంపూర్ణంగా లేదా పాక్షికంగా లాక్ డౌన్ పాటిస్తున్నాయి. కానీ తెలంగాణా రాష్ట్రం మాత్రం మొదటి నుంచి లాక్ డౌన్ కు విముఖంగా వుంది. కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించినా కూడా కరోనా అంతగా తగ్గలేదని సిఎం కెసిఆర్ ఇటివల జరిగిన సమీక్ష సందర్భంగా అభిప్రాయ పడ్డారు. అయితే రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ లోకి రావాలంటే కొన్ని రోజులైనా లాక్ డౌన్ పెట్టాలని కొందరు అధికారులు సిఎంకు చెప్పినట్లు తెలిసింది.
లాక్ డౌన్ విధించడం వల్ల కలిగే ఎదురయ్యే పరిణామాలతో పాటు రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియమీద ఈ ప్రభావం ఏమేరకు ఉంటుందనే అంశం పై క్యాబినెట్ చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నది.